అవును ట్విట్టర్ ట్రెండింగ్‌లో వనిత టాప్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరంటే? వనిత ప్రముఖ నటులు, దంపతులు విజయకుమార్, మంజుల కుమార్తె. ఈమె చుట్టూ వివాదాలే తిరుగుతూవుంటాయి. గతంలో తండ్రితోనే ఆస్తి వివాదంలో కయ్యానికి కాలు దువ్వింది. ప్రస్తుతం బిగ్ బాస్ మూడో సీజన్ తమిళ రియాల్టీ షోలో వివాదాలతో దూసుకెళ్తోంది.
సోమవారం ఇరు వర్గాల మధ్య పెద్ద వారే జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ప్రోమో వీడియోలో వాట్ నాన్‌సెన్స్ బిగ్ బాస్ అంటూ వనిత మైకును ఊడదీసింది. ఈ విషయం పెను సంచలనానికి దారి తీసింది. ఇంకా చేరన్, షెరిన్ బిగ్ బాస్ విజేతలయ్యే అర్హత లేదా అంటే ఆవేశంతో ఊగిపోయింది. ఇంకేముంది.. ఎమోషన్ అంటే ఏమిటో తెలియని వనితను తలచి ఏం చేసేదో తెలియక కవిన్ టీమ్ కామ్‌గా వుండిపోయారు. అయినా వనితాకు కవిన్ టీమ్‌కు మధ్య ఈ వారం పెద్ద వార్ జరగడం ఖాయమని తెలుస్తోంది.