రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం VD12 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. కాగా, ఈ సినిమా అప్ డేట్ గురించి నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గౌతమ్ ను చాలా హింస పెట్టాక, చర్చలు జరిపాక టైటిల్ ను త్వరలో తెలియజేయనున్నాం. బీ రెడీ రౌడీ ఫ్యాన్స్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో రాజులా వుండేలా టైటిల్ ను అనుకున్నట్లు ఫిలింనగర్ లో కథనాలు వినిపిస్తున్నాయి.