ఇటీవల బెల్జియం యువతితో విజయ్ దేవరకొండ చెట్టపట్టాలు వేస్తున్న ఫోటోలతో పాటు రొమాంటిక్‌గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బెల్జియం యువతి వర్జినీతో పెళ్ళి చూపులు చిత్రం నుండే విజయ్‌కి పరిచయం ఉందని అన్నారు. విజయ్‌తో పాటు ఆయన ఫ్యామిలీతో వర్జినీ కలిసి ఉన్న ఫోటోలు వైరల్‌గా మారడంతో అభిమానులలో అనేక అనుమానాలు మొదలయ్యాయి.
దీనిపై విజయ్ ఎప్పుడు స్పందిస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తుండగా, నోటా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో దీనిపై నోరు విప్పాడు. ఫోటోలలో ఉన్నది తాను కాదని చెప్పిన విజయ్ దేవరకొండ, పిక్‌ని మార్ఫింగ్ చేశారని నేను అనుకోవడం లేదని అన్నాడు. అమ్మాయి చాలా మంచిది. ఇక ఈ విషయాన్ని ఇంతటితో మరచిపోతే బాగుంటుందంటూ కోరాడు.
కాగా, యంగ్అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ విజయ్ దేవరకొండ వరుస హిట్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమాలంటే అభిమానులలో ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా 'నోటా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజకీయ నాయకుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. విజయ్ నటించిన 'టాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్' చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.