డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా "డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్" ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఓహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ షో గురించి ఓంకార్ మాట్లాడుతూ, వైల్డ్ ఫైర్ అని షోకు పేరు పెట్టినప్పుడు ఇంకా పుష్ప2 సినిమా రిలీజ్ కాలేదు. అంతకుముందే షో అనుకున్నప్పుడు పేరు పెట్టాం అన్నారు. అదేవిధంగా ఫరియా మాట్లాడుతూ, నేను డాన్స్ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వున్నా సినిమాలువదులుకోలేదు. అవికూడా మరోవైపు చేస్తూనే వున్నాను. పాటలు కూడా పాడబోతున్నాను అన్నారు.
డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్ లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ వివరాలను ఈరోజు హైదరాబాద్ లో షో లో పాల్గొన్నవారు మాట్లాడారు.
హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ - డ్యాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో మీకు తెలుసు. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఫరియా అబ్దుల్లా హోస్ట్ గా చేస్తుండటం హ్యాపీగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. డ్యాన్స్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. పంచభూతాల్లాంటి వారి పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్ ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ముగ్గురు హోస్ట్ లతో పాటు మరో నలుగురు మెంటార్స్ ఉంటారు. సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" లో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకు థ్యాంక్స్. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" మిమ్మల్ని డెఫనెట్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. నేను సినిమాకు వర్క్ చేశా టీవీకీ వర్క్ చేశా. ఏ ప్లేస్ లో వర్క్ చేసినా ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం టాప్ క్వాలిటీలో ఉండేలా చూసుకుంటా. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో . అన్నారు.
హోస్ట్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ - డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 టైమ్ లో కూడా నన్ను హోస్ట్ గా అడిగారు. అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల సీజన్ 1 చేయలేకపోయాను. ఇప్పుడు "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"లో హోస్ట్ గా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఓంకార్, శేఖర్ మాస్టర్ తో కలిసి హోస్ట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఆ కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ చూసేందుకు వెయిట్ చేస్తున్నా. ఓంకార్ గారు చెప్పినట్లు ఐదుగురు కంటెస్టెంట్స్ తమ పర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తారు. నలుగురు మెంటార్స్ నిజంగా వైల్డ్ ఫైర్ లా షో చేశారు. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" మీకు కంప్లీట్ ఎంటర్ టైంట్ ఇస్తుందని గ్యారెంటీగా చెప్పగలను. నేను హీరోయిన్ గా సినిమాలు చేయడాన్ని ఎంతగా ఎంజాయ్ చేస్తానో అలాగే ఇలాంటి షోస్ చేయడాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. అన్నారు.
హోస్ట్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ - డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 ను పెద్ద సక్సెస్ చేశారు. ఇప్పుడు "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" మీ ముందుకు వస్తోంది. మూవీస్ బిజీలో ఉండటం వల్ల నేను ఈ కార్యక్రమానికి రాలేకపోయాను. నేను జడ్జ్ గా చేస్తున్నా...మేము కూడా సర్ ప్రైజ్ చేసేలా డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ లు ఉంటాయి. ఈ షోలో తీసుకున్న పంచభూతాల కాన్సెప్ట్ పేరుకు తగినట్లే ఐదుగురు కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ అద్భుతంగా సెట్ అయ్యింది. ఆహాలో ఈ నెల 14 తేదీ రాత్రి 7 గంటల నుంచి అదిరిపోయే పర్ ఫార్మెన్స్ ల కోసం "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" చూడండి. అన్నారు.
మెంటార్ యష్ మాస్టర్ మాట్లాడుతూ - డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ షోను సరికొత్తగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క ఆడియెన్ ను ఆకట్టుకుంటుంది. ఆహాను సబ్ స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే చేసుకుని మా "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"షోను చూడండి. ఫిబ్రవరి 14 నుంచి మిమ్మల్ని "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" ఎంటర్ టైన్ చేయబోతోంది. అన్నారు.
మెంటార్ మానస్ మాట్లాడుతూ - "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"లో మెంటార్ గా వ్యవహరించే అవకాశం ఇచ్చిన ఓంకార్ అన్నయ్యకు థ్యాంక్స్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 బిగ్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు సీజన్ 2 కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఓంకార్ గారు. ఆయనకు ఆడియెన్స్ పల్స్ తెలుసు. వన్ సెకండ్ అంటూ ఎలా ఉత్కంఠకు గురి చేస్తారో మీరంతా చూశారు. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"లో ఎన్నో థ్రిల్స్, సస్పెన్స్ లు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కే మాకు సినిమా కనిపించింది. ఫిబ్రవరి 14 నుంచి ఆహాలో "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" చూడండి. అన్నారు.
సింగర్ జాను లైరి మాట్లాడుతూ - ఫోక్ సాంగ్స్ అంటే కొందరిలో చిన్నచూపు ఉండేది. కానీ నన్ను ఆ జానపద గీతాలే ఈ వేదిక దాకా తీసుకొచ్చాయి. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" మెంటార్ గా ఉండే అవకాశం కల్పించిన ఓంకార్ గారికి థ్యాంక్స్. మెంటార్ గా చేయాలంటే గట్స్ ఉండాలి, ఏదైనా చెప్పగలిగే ధైర్యం ఉండాలి. నాకు అలాంటి అవకాశం "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" షోతో దొరికింది. ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ నేను ఎక్స్ పెక్ట్ చేయలేకపోయాను. అంత బాగా చేశారు. మీరంతా "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"షో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
మెంటార్ ప్రకృతి మాట్లాడుతూ - "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" షోలో మెంటార్ గా ఉండే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. నా పుట్టినరోజున ఈ కాల్ వచ్చింది. మెంటార్ గా చేయాలి అన్నప్పుడు నమ్మలేకపోయాను. నేను ఫెమీనా మిస్ తెలంగాణగా ఎంపికయ్యాను. అయితే మోడలింగ్ కు ఈ డ్యాన్స్ షో మెంటార్ గా ఉండటానికి మధ్య చాలా తేడా ఉంది. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"ను అర్థం చేసుకునే క్రమంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఏపీ, తెలంగాణ అని కాదు దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ మిమ్మల్ని తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. అని చెప్పింది.