ఎవరు నువ్వు..? అంటూ సాగే ఈ పాట.. ప్రేక్షకులను సరికొత్త ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్లేలా ఉంది. ఈ పాటను ఎంఎస్ కృష్ణ, అంజనా రాజగోపాలన్ ఆలపించగా.. భవ్యశ్రీ సాహిత్యం అందించారు. గిరీష్ గోపాలకృష్ణన్ అందించిన మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ఈ పాటతో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు మూవీ మేకర్స్.
బాలాజీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హత్య మూవీ జూలై 21న థియేటర్లలోకి రాబోతుంది. కంప్లీట్ మేకోవర్‌తో.. సరికొత్త కొత్త లుక్‌లో స్టైలీష్‌గా విజయ్ ఆంటోని కనిపిస్తున్నాడు. కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు విజయ్.. మరోసారి అలాంటి స్టోరీనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ హత్య మూవీని నిర్మిస్తోంది. కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.