ఇక హారిక హాసిని సంస్థ ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయడానికి నమ్రత చాలా హుందాగా వ్యవహరించింది. ఎవ్వరికీ ఇబ్బంది రాకుండా ఆమె తీసుకున్న కేర్ గురించి గొప్పగా చెబుతున్నారు ఫిలింనగర్ జనం. ఇక ఈ గేప్‌లో ఏదైనా వ్యాపార ప్రకటనలు వస్తే వాటిని త్రివిక్రమ్‌చేత చేయించాలని ఆమె ప్లాన్ వేసింది. ఎందుకంటే ప్రాజెక్ట్ తప్పిపోయినా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ బాగుండాలని నమ్రత ఆలోచన.
అసలు త్రవిక్రమ్‌తో మహేష్ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నది నమ్రతనే. కరోనాకుముందు అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు విడుదలయ్యాయి. సరిలేరు.. సినిమా బాగుంది. మంచి సందేశం ఇమిడి వుంది. బాగానే ఆడింది. కానీ అల వైకుంఠ.. సినిమాకు వచ్చినంత క్రేజ్ అంతా ఇంతాకాదు. అందులోని పాటలకు, లవ్ సీన్స్‌కు, కుటుంబ నేపథ్య సన్నివేశాలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కలెక్షన్లపరంగా నెంబర్^1లో నిలిచింది. అందుకే అది గ్రహించిన నమ్రత త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందులో ఓ మతలబు కూడా దాగి వుందని సమాచారం. సరైన కథను త్రివిక్రమ్‌తో రాయించి ఆ సినిమాను నమ్రత స్వంత బేనర్‌లో తీయాలనుకుంటున్నదని ఫిలింనగర్ టాక్. చూద్దాం. ముందు ముందు ఏం జరుగుతుందో.