'పరుచూరి పాఠాలు' పేరుతో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అనేక అంశాలపై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' గురించి కూడా ప్రస్తావించారు. ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్ పాత్ర పోషించడంతో కొన్ని పరిమితులకు లోబడి నటించాల్సి వచ్చిందన్నారు.
గతంలో 'శంకర్‌దాదా జిందాబాద్' సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆ సినిమా చిరు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని చెప్పానన్నారు. చిరంజీవి ఇమేజ్ మహావృక్షంలాంటిదని, అలాంటి వ్యక్తి 'శాంతి' వచనాలు చెబితే ప్రేక్షకులకు రుచించదని అన్నారు.
ఇదే విషయాన్ని అప్పట్లో చిరు దృష్టికి తీసుకొస్తే, 'మీరు కాస్త రెబల్ కాబట్టి, మీకు పెద్దగా నచ్చదులేండి' అన్నట్లు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారని గోపాలకృష్ణ అన్నారు. చిరంజీవిలాంటి హీరోకు ఉన్న అభిమానగణం తమను ఎంటర్‌టైన్‌చేసేలా సినిమా ఉండాలని కోరుకుంటారని వివరించారు.