అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో రూపొందిన శైలజారెడ్డి అల్లుడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. అంచనాలకు తగ్గట్టుగా అన్ని ఏరియాల్లో మంచి రిపోర్ట్ వచ్చింది. చైతన్య కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇదే. వినాయక చవితి సందర్భంగా రిలీజైన ఈ సినిమా అభిమానులకు నిజమైన పండగని తెచ్చింది. ఇదిలాఉంటే... అక్టోబర్ 6న చైతన్య - సమంతల పెళ్లి రోజు. అప్పుడే వీరి పెళ్లయి సంవత్సరం అయిపోయింది.
అయితే... ఫస్ట్ మ్యారేజ్ డేకి వీళ్లిద్దరూ ఏం చేయనున్నారో తెలసింది. ఇంతకీ ఏం చేయనున్నారంటే... చైతన్య, సమంత కలిసి నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారట. ఆవిధంగా ఫస్ట్ మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు టాలీవుడ్ క్రేజీ కపుల్. ఇక అక్టోబర్ నెలాఖరున చైతన్య మావయ్య వెంకీతో కలిసి నటిస్తోన్న వెంకీ మామ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అదీ..సంగతి.