ఓనమాల మాస్టారు వస్తున్నాడోచ్‌!

మంగళవారం, 17 జులై 2012 (14:12 IST)
WD
రాజేంద్రప్రసాద్‌ పోషించిన నారాయణ మాస్టారు పాత్రను 'ఓనమాలు' చిత్రంలో కొత్త దర్శకుడు క్రాంతి మాధవ్‌ తెరకెక్కించారు. ఏడాదినాడు చేసిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది. ఈ నెల 27న విడుదలచేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ చిత్ర దర్శకనిర్మాత క్రాంతిమాధవ్‌ మాట్లాడుతూ.. మనిషి ఓడలాంటివాడు. ఒడ్డుకు చేరితే ఓడకు ఎలాగైతే విలువ వస్తుందో, అలాగే మనిషి కూడా ఏదో ఒక విజయపు ఒడ్డుకు చేరితేనే విలువ. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు.

రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ- ఎన్ని సినిమాలు నటించినా.. ఏదో చేయాలని ఆశ, ఉద్వేగం కొన్ని సినిమాలకే కలుగుతుంది. అలాంటిదే ఈ సినిమా. నారాయణరావు మాస్టారు పాత్ర నా మనసుకు బాగా నచ్చింది. కచ్చితంగా మహిళలతో సహా పిల్లలకు బాగా నచ్చుతుందనే హామీ ఇస్తున్నాని అన్నారు.

వెబ్దునియా పై చదవండి