"సీతారాముల కళ్యాణం లంకలో" ట్రైలర్ మీ కోసం..

నితిన్‌, హన్సిక హీరోహీరోయిన్లుగా వెల్ఫేర్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఈశ్వర్‌ దర్శకత్వంలో డా. మళ్ళ విజయప్రసాద్‌ నిర్మిస్తున్న "సీతారాముల కళ్యాణం లంకలో" చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఈశ్వర్‌ మాట్లాడుతూ 'సంపూర్ణ హాస్య రసభరిత చిత్రంగా, సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇంకా దర్శకుడు మాట్లాడుతూ.. "సీతారాముల కళ్యాణం లంకలో ఏ విధంగా జరిగింది? అనే అంశం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. కండబలం కన్నా బుద్ధి బలం గొప్పది అనే అంశం ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్‌ అభినయం వైవిధ్యంగా ఉంటుంది" అన్నారు.

బ్రహ్మనందం, సుమన్‌, సలీమ్‌ పండా, వేణుమాధవ్‌, ఆలీ, యం.యస్‌. నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌, కెమెరా: జోషి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మన్‌, నిర్మాత: డా. మళ్ళ విజయప్రసాద్‌, దర్శకత్వం: ఈశ్వర్‌.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

వెబ్దునియా పై చదవండి