Dear Krishna- Mamita Baiju
అక్షయ్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్ గా 'ప్రేమలు' చిత్రం బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం డియర్ కృష్ణ. ఈ చిత్రం ట్రైలర్ ను నేడు రైటర్ కమ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు సర్వత్ర మంచి స్పందన వస్తుంది. పీఎన్ బలరామ్ రచయిత, నిర్మాతగా, దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్దం అయింది.