దేశభక్తి నేపథ్యంలో జై జవాన్‌ ట్రయిలర్‌ ఆవిష్కరించిన దర్శకుడు మలినేని గోపీచంద్

డీవీ

శుక్రవారం, 16 ఆగస్టు 2024 (10:46 IST)
Director Malineni Gopichand and jai Jawaan team
సంతోష్‌ కల్వచెర్ల కథానాయకుడిగా పావని రామిశెట్టి కథానాయికగా ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, సత్యప్రకాష్‌, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్‌, బిహెచ్‌ఇఎల్‌ ప్రసాద్‌, బలగం సంజయ్‌, బాల పరసార్‌, సంజన చౌదరి ముఖ్యతారలుగా రూపొందిన ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ 'జై జవాన్‌'. నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్‌ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
దేశభక్తి నేపథ్యంలో దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలియజేసే  కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కాన్సెప్ట్‌ నచ్చి ఈ చిత్ర ట్రైలర్‌ను ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా  ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు.  
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం కాన్సెప్ట్‌ తనకు నచ్చిందని, ట్రయిలర్‌ చూస్తుంటే దేశభక్తి నేపథ్యంలో రూపొందిన గొప్ప చిత్రంలా ఈ సినిమా వుండబోతుందని, ఇలాంటి ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ విజయం సాధించాలని, ఈ సినిమా ద్వారా ఈ టీమ్‌ అందరికి మంచి పేరును తీసుకరావాలని  ఆయన విషెస్‌ అందజేశారు.
 
నిర్మాతలు మాట్లాడుతూ 'దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైనికుడి గొప్పతనం గురించి తెలియజేశాం. సంతోష్‌ కల్వచెర్ల హీరోగా చక్కని ప్రతిభను కనపరిచాడు. ఆయనకు హీరోగా మంచి భవిష్యత్‌ వుంది. మా ట్రైలర్‌ను ఆవిష్కరించి,మాకు విషెస్‌ అందజేసిన గోపీచంద్‌ మలినేని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం' అన్నారు.
 
ఈ కార్యక్రమం లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు కూడా పాల్గొన్నారు. ఇక ఈ ట్రైలర్‌ చూస్తుంటే దేశభక్తి వున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా, సైనికుడు ఈ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు.'ప్రాణం తీసే ఆయుధాలంటే భయం లేదు నాకు...చావు కోరే శత్రువులంటే కోపం రాదు' అంటూ తనికెళ్ల భరణి గారు చెప్పిన సంభాషణ... 'జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని, జీవితానిచ్చిన మాతృభూమి రుణాన్ని తీర్చుకునేది ఒక జవాన్‌ మాత్రమే' అని సాయికుమార్‌ చెప్పిన డైలాగులు వింటూంటే గూస్‌బంప్స్‌ వచ్చే విధంగా వున్నాయి.ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌ అందర్ని ఆకట్టుకుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు