టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌లు సరదాగా కికి ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కానీ వీరి కికి ఛాలెంజ్ వెరైటీగా మారింది. రోడ్డుపై కాకుండా సురక్షితమైన ప్రాంతంలో కికి ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. వీరిద్దరూ పాల్గొన్న కికి ఛాలెంజ్‌లో ఈ ఛాలెంజ్ వద్దనేలా వుంది.
కాగా.. కికి ఛాలెంజ్ ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణిస్తున్న వాహనం నుంచి కిందకు దిగి డ్యాన్స్ చేస్తూ, మళ్లీ వాహనంలోకి ఎక్కడమే ఈ ఛాలెంజ్. ఈ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలి. అయితే కికి ఛాలెంజ్‌తో ప్రమాదం వుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఛాలెంజ్‌పై పోలీసులు నిషేధం విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలు పాటిస్తూ వీల్ ఛైర్‌పై కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ కికీ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన సెల్ఫీని శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సెల్ఫీలో శ్రీనివాస్‌తో పాటు నీల్ నితిన్ ముఖేష్, కాజల్ గాయాలతో కనిపిస్తున్నారు. తాజాగా కాజల్ విడుదల చేసిన కికి వీడియోలోనూ స్వల్ప గాయాలైనట్లు కనిపిస్తోంది.