చాలామందికి బుజ్జి కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. అవి రోడ్ల పైన బుజ్జిబుజ్జి అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే వాటిని కొంతమంది పెంచుకునేందుకు తీసుకుని వెళ్తుంటారు. అలాగే బెంగళూరులోని కెంగేరిలో వుంటున్న ఓ కుటుంబంలోని సభ్యులకు వాళ్లు వెళ్తున్న దారిలో కుక్కపిల్ల కనిపించేసరికి దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి దానికి కావలసినవన్నీ తినిపించడం చేస్తూ వచ్చారు.