వెంటనే ఆ యువతి వెంటనే స్నేక్ రెస్క్యూ సేవల కోసం కాల్ చేస్తుంది. వెంటనే పామును రక్షించే సిబ్బంది బైకుపై వస్తారు. వారిలో ఒకరు పామును సురక్షితంగా రక్షించడానికి ఒక స్తంభాన్ని ఉపయోగించి, దానిని బంధించి ఒక పెట్టెలో ఉంచుతారు.
ఇది ఆ జంట ప్రేమకథగా మారుతుంది. చివరిగా ఈ జంట చేతులు జోడించి షికారు చేస్తున్నప్పుడు, పాము వారిని ఆసక్తిగా గమనిస్తుంది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో వారు ఈ ప్రీ -వెడ్డింగ్ వీడియోను వైరల్ చేస్తున్నారు.