పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి కాకినాడ పోర్టులో 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఎవరిని నిందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీనికి అడ్డుకట్ట వేయడం కలెక్టర్, ఎస్పీల బాధ్యత కాదా అని నిలదీశారు. ఆ అధికారులు దీన్ని ఎలా విస్మరిస్తారన్నారు. విజిలెన్స్ శాఖ తన పని తాను సక్రమంగా నిర్వర్తిస్తే మంత్రి అక్కడి వెళ్లి అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందన్నారు.