కోవై జిల్లా, మరుదమలై పశ్చిమ శ్రేణి పర్వత ప్రాంతం. ఇక్కడ గత కొన్ని రోజులుగా సుమారు 11 ఏనుగులు నివాస ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఈ ఏనుగులు ఆహారం, నీరు కోసం రాత్రి వేళల్లో ప్రజల నివాస ప్రాంతంలోకి వస్తున్నాయి.
ఆ విధంగా వచ్చే ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తిరిగి పంపేందుకు అటవీశాఖా అధికారులు సిద్ధంగా వుంటారు. ఈ నేపథ్యంలో నిన్న శనివారం రాత్రి, మరుదమలై సమీపంలో ఉన్న భారతీయర్ విశ్వవిద్యాలయం సమీపంలోని నివాస ప్రాంతంలో సాయంత్రం వాకింగ్ వెళ్లిన దంపతులు అడవి ఏనుగును చూసి షాకయ్యారు. వెంటనే ఆ దంపతులు ఇంట్లోకి పరుగులు పెట్టారు. ఆపై ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.