ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

ఐవీఆర్

ఆదివారం, 5 జనవరి 2025 (18:45 IST)
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటీమణి త్రిష (Trisha). ఇపుడు ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడు (Tamil Nadu) వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అందుకు కారణం... తను ఏదో ఒకరోజు తమిళనాడుకు ముఖ్యమంత్రి (chief ministers of Tamil Nadu)ని అవుతానని అనడమే. ఆమె ఇటీవల మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె ఏమి అన్నదంటే... సామాజిక సమస్యలపై పోరాడుతూ...  ప్రజా సేవ చేయాలన్నదే తన ఆలోచన అని చెప్పింది.
 
తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ఎంతో వుందన్న త్రిష, ఏదో ఒక రోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలన్నది తన కోరిక అని చెప్పింది. దీనితో తమిళనాడు వ్యాప్తంగా త్రిష వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇటీవలే నటుడు విజయ్ రాజకీయ పార్టీ స్థాపించారు. కనుక అతడికి పోటీగా ఆమె నిలుస్తుందా... అందుకు వేదికగా ఏ పార్టీని ఎంచుకుంటుందోననే చర్చ జరుగుతోంది. కాగా వచ్చే 2026వ సంవత్సరం ప్రధమార్థంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
 
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు