మరోవైపు, ఈ సబ్ వేరియంట్ కరోనా సోకిన వారికి, రెండు డోసులు వేయించుకున్న వారికి సోకుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరేంత ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. కానీ, ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఈ వేరియంట్ మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. అయితే, భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికితోడు వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ బీఏ.4 ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.