అందులో కొంత నీలం రంగు కూడా మిక్స్ అయిందట. ఇక్కడ జగన్ పార్టీ వైఎస్ఆర్ సిపీ జెండాలో అత్యధికం నీలం రంగు కావడం విశేషం. వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ జెండాలో పాలపిట్ట రంగు 80%, నీలం రంగు 20% ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.
జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. ఈనెల 8న షర్మిల తన తండ్రి దివంగత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు కొత్త పార్టీ పేరు జెండా ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ జేఆర్సీ సెంటర్లో పార్టీ ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలుస్తోంది.