పవర్ స్టార్ పెద్ద మనసు : తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి - కేంద్రానికి రూ.కోటి

గురువారం, 26 మార్చి 2020 (10:03 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు తనలోని పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా బాధిత రోగుల సహాయార్థం రెండు తెలుగు రాష్ట్రాలకు తనవంతు సాయంగా రూ.కోటి ప్రకటించారు. అంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.50 లక్షలు, తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బులను విరాళంగా ఇవ్వనున్నానని, కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ డబ్బులను వెచ్చించాలని పవన్ కోరారు. 
 
కాగా, ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనవంతు సాయంగా రూ.10 లక్షలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించారు. అలాగే, హీరో నితిన్ కూడా తనవంతు సాయంగా ఇరు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. 
 
ఇకపోతే, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల భార్య అనుపమ నాదెళ్ళ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆమె తండ్రి సీఎం కేసీఆర్‌ను కలిసి అందజేశారు.

మరోవైపు ప్రధానమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయల ఆర్ధిక సాయం చేయబోతున్నట్టు కూడా తెలియజేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం రూ. 10లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు  ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు