ఆ తర్వాత భక్తులు లేకపోవడంతో ఆలయాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అందులోను టిటిడి ఆధ్వర్యంలో నడుపబడే తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం సరిగ్గా శేషాచలం అడవులకు సమీపంలో ఉంది. శేషాచలం అడవుల్లో చిరుత పులల సంచారం ఎప్పటి నుంచో ఉంది. నిర్మానుషంగా ఉండటంతో చిరుత పులులు ఇష్టానుసారం జనం తిరిగే ప్రాంతంలోకే వచ్చేస్తున్నాయి.
కపిలేశ్వర ఆలయంలో కూడా రాత్రి 7 గంటల సమయంలో రెండు చిరుతపులులు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సిసి కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడున్న టిటిడి సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. అయితే అప్పటికే చిరుతలు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. కానీ మొట్టమొదటి సారి ఆలయంలోకి చిరుతలు రావడం ఇదే ప్రధమమంటున్నారు టిటిడి అధికారులు.