తాజాగా ఓ మానవ మృగం తన కారు పార్కింగ్ చేస్తుండగా ఆ బాలుడుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. సికింద్రాబాద్ అల్వాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కాంతారావు అనే వ్యక్తి ఓ బాలుడ్ని విచక్షణారహితంగా చావబాదాడు. కారుకు అడ్డంగా వచ్చాడని చిన్నారి అని చూడకుండా పిడిగుద్దులు కురిపించాడు. చిన్నారి మెడ తిప్పడం వంటివి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అయితే... కాంతారావు దెబ్బలకు బెదిరిపోయే... ఒళ్లంతా నొప్పులతో చిన్నారి ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడు తండ్రి కాంతారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు అపార్ట్‌మెంట్ వాసులు కూడా కాంతారావు వైఖరిపై మండిపడుతున్నారు. చిన్నారిని అంతలా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. కాంతారావుపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.