పాముకు సీపీఆర్ చేసిన పోలీస్.. వీడియో వైరల్

గురువారం, 26 అక్టోబరు 2023 (19:38 IST)
CPR on snake
సీపీఆర్ చేసి మనుషుల ప్రాణాలు కాపాడటం చూసేవుంటాం. అయితే ఓ పోలీస్ ఏకంగా పాముకు సీపీఆర్ చేశారు. పామును నోట్లో పెట్టుకుని గాలి ఊది దాని ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించాడు. ఈయన చేసిన ఈ సాహసాన్ని చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో చోటుచేసుకుంది. 
 
సెమ్రీ హర్ చంద్‌లోని ఓ కాలనీలో పాము ఉన్నట్లు ఫోన్ వచ్చింది. వెంటనే కానిస్టేబుల్ అతుల్ శర్మ ఆ కాలనీకి బయల్దేరారు. అతుల్ శర్మ డిస్కవరీ ఛానల్ చూసి పాములను కాపాడటం నేర్చుకున్నాడు. 
 
2008 నుంచి ఇప్పటివరకు అతుల్ శర్మ దాదాపు 500 పాములను రక్షించారు. ఈసారి పాము నీటి పైపులైనులో ఉదంని తెలుసుకుని దానిని బయటకు రప్పించేందుకు పురుగమందును నీటిలో కలిపాడు. దాంతో పాము అపస్మాకరక స్థితికి వెళ్లింది. వెంటనే దానిని బయటకు తీసి సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. 
 
ఆ మొత్తం ఘటనను చుట్టుపక్కల వాళ్లు కళ్లార్పకుండా చూశారు. కొందరు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

#Video | Cop Gives CPR To Snake Who Lost Consciousness Due To Pesticide-Laced Water pic.twitter.com/yRlJEm9eVb

— NDTV (@ndtv) October 26, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు