పవన్ కళ్యాణ్... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఓ పవర్ ఫుల్ పవర్ స్టార్. తెరపై కనబడితే ఫ్యాన్స్ ఊగిపోతారు. అదీ పవన్ కల్యాణ్ స్టామినా. ఐతే పొలిటిక్స్ విషయంలో అవినీతి లేని రాజకీయాలు చేస్తానని చెప్పిన జనసేనాని అదే దారిలో వెళ్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి పరాజయం పాలైనా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవాడిని... ప్రజలకు నేనేంటో అర్థం కావాలి కదా అని చెప్పారు.
తాజాగా యురేనియం తవ్వకాలకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్నదంటూ వచ్చిన వార్తలపై ముందుగా గళమెత్తింది పవన్ కల్యాణే. ప్రజల్లో దీనిపై అవగాహన పెంచి అంతా మూకుమ్మడిగా కథం తొక్కేవిధంగా చేయడంలో సఫలీకృతుడయ్యారు. ఇపుడిదే రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటు వైకాపా అటు తెరాస చేయలేనిది జనసేన చేసిందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు పవన్ కల్యాణ్ ను ప్రశంసిస్తున్నారు.
ప్రజలకు సమస్యలను సృష్టించే వాటిని ఎదుర్కోవడంలో జనసేనాని వ్యవహరించిన తీరు శభాష్ అని కొనియాడుతున్నారు. ఈ ప్రశంసలను చూసిన తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ ఒకింత ఆసక్తిని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారట. మొత్తమ్మీద రోజురోజుకీ జనసేన మెల్లిగా బలపడుతోందన్నమాటేగా.