దేశంలో సరికొత్త విద్యావిధానం.. పేరు అదేనా? నిర్మలమ్మ ఏం చెప్పారు?

శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:54 IST)
దేశ వ్యాప్తంగా సరికొత్త విద్యా విధానాన్ని తీసుకునిరానున్నట్టు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే, విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవనున్నట్టు ఆమె శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2020-21 వార్షిక బడ్జెట్‌లో వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యా సంవత్సరానికి ఏకంగా రూ.99,300 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. 
 
ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగంలో విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. 
 
నైపుణ్యాభివృద్ధికి రూ.3000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో కొత్తగా సరస్వతి, సింధు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, నేషనల్ ఫోరెన్సిక్స్ రీసెర్స్ సైన్స్ యూనివర్శిటీని నెలకొల్పుతామన్నారు. 
 
స్టార్టప్‌లకు పెద్దపీట వేస్తూ.. ప్రోత్సాహన్ని ఇవ్వనున్నామని.. యువ పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపారు. ఇతరులకు ఉపాధి కల్పించేలా యువత ఎదగాలని సూచించారు. పీపీపీ పద్దతిలో ఐదు స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
 
దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయనీ, ఆ కారణంగా డిజిటల్ ఇండియాకే పెట్ట పీట వేసినట్టు చెప్పారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన కారణంగా.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఆవాసం ఏర్పాటు చేశామన్నారు.
 
జీడీపీతో ప్రభుత్వ రుణభారం తగ్గిందని చెప్పుకొచ్చారు. గతేడాది మార్చిలో ఇది 48.7 శాతం తగ్గిందన్నారు. ప్రధాన మంత్రి గృహ ఆవాస యోజన పథకంతో దేశవ్యాప్తంగా ప్రజలకు గృహ వసతి లభించిందన్నారు. కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుగా మారినట్లు ఆమె తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినట్లు చెప్పినట్లు ఆమె.. ఈ బడ్జెట్ సామాన్య ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటుందని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు