ప్రతి ఒక్కరు బీరువా ఈ దిక్కున ఉండకూడదు ఆ దిక్కున ఉండకూడదని చెబుతున్నారు. ఏ దిక్కున బీరువా పెడితే డబ్బులు నిల్వ ఉంటాయి... ఏ దిక్కున పెడితే డబ్బులు వస్తాయన్న విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అయితే వాస్తు నిపుణులు మాత్రం ఇలా చేస్తే డబ్బులు, నగలు బాగా వస్తుందంటున్నారు.
ముఖ్యంగా నైరుతి పక్కన డబ్బులు, నగలు పెడితే ఇబ్బందులు తప్పవంటున్నారు. అలా పెడితే బీరువాలో నగలు, డబ్బులు అస్సలు పెరగవట. కానీ ఉత్తర వాయువ్యంలో బీరువా పెడితే మంచిదట. ఉత్తరం గోడ, పడమట గోడ ఈరెండు కలిసిన మూలమే వాయువ్యం అంటారు. అందులో ఉత్తరానికి బీరువా వెనుక చూసే విధంగా డబ్బులు, నగలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి..వెళ్ళాలి అనుకుంటుందట.
ఉత్తరవాయువ్యంలో బీరువా పెట్టి డబ్బులు, నగలను పెడుతూ, తీస్తూ ఉంటే ధనం పెరగడమే కాకుండా ఇంట్లో సంతోషంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గాలి వేగంగా డబ్బులు వస్తుందట. అలాగే గాలి వేగంతో డబ్బులు ఖర్చవుతుందట. డబ్బులు ఎదగడం కూడా మొదలవుతుందట.