పెరిగిన నిరుద్యోగుల సంఖ్య... మరి ప్రధాని మోదీ ఏం చెపుతారో?

బుధవారం, 6 మార్చి 2019 (14:13 IST)
దేశంలో నిరుద్యోగ భూతం విలయతాండవం చేస్తోంది. నిరుద్యోగులు నానాటికి పెరిగిపోతున్నారు. 2018లో తీసిన గణాంకాలతో పోలిస్తే దాదాపు 1.3 శాతం నిరుద్యోగం పెరిగింది. మంగళవారం విడుదల చేసిన సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) నివేదిక ప్రకారం 2018 సెప్టెంబర్‌లో 5.9 శాతంగా ఉన్న నిరుద్యోగం 2019 మార్చి నాటికి 7.2 శాతానికి చేరుకుందని వెల్లడైంది. 
 
2016 సంవత్సరం నాటి నుంచి ఇదే అత్యధిక నిరుద్యోగిత రేటు అని నివేదికలో తెలిపారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే దాదాపు ఆరు మిలియన్ల నిరుద్యోగులు పెరిగారని అంచనా. దేశవ్యాప్తంగా పదివేల కుటుంబాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా సీఎమ్ఐఈ ఈ నివేదిక తయారు చేసింది. ఈ సమాచారం ప్రభుత్వం రూపొందించే నిరుద్యోగిత డేటాకి ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఈ నివేదిక అధికారంలో ఉన్న బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు