ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
ఈ సందర్భంగా పలు రంగాల్లో నిష్ణాతులైన మహిళలను ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాలన్నారు. మహిళా ఉద్యోగులకు దేశభక్తి, భక్తి పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయాలన్నారు.
అనంతరం కార్యనిర్వాహక, వక్తల ఎంపిక, జ్ఞాపికల కొనుగోలు, సాంస్కృతిక కమిటీలను ఏర్పాటు చేశారు. స్థాయితో సంబంధం లేకుండా మహిళా ఉద్యోగులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో టిటిడి ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి స్నేహలత, శ్రీమతి శాంతి, శ్రీ ఆనందరాజు, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జమునారాణి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రేణు దీక్షిత్, సంక్షేమ విభాగం సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.