ఆకుకూరలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్కల మొదళ్ళలో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. ఇంట్లో ఫర్నిచర్స్‌కు రంగులు వేసేటప్పుడు కుర్చీ లేదా డైనింగ్ టేబుల్ నాలుగు కోళ్ళ కింద సీసా మూతలను ఉంచితే రంగు కారినా గచ్చుకు అంటుకోదు.
ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు కలిపితే దోమలు, ఈగలు రావట. ఇల్లు తుడిచిన స్పాంజ్‌లో నీటిని విదిలించి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడు కాకుండా ఉంటాయి. పనిమీద ఒక వారంపాటు మీరు బయటకు వెళితే ఇంటికి వచ్చి తలుపులు తెరిస్తే ఒకలాంటి వాసన వస్తుంది.