చలి మొదలవుతోందంటేనే మహిళలకు కొత్త సమస్యలు. సీజనల్ సమస్యలలో భాగంగా చర్మం తెల్లబారిపోవడం, జుట్టు అందవిహీనంగా, నిస్తేజంగా మారిపోవడంతో చాలామందికి కొత్త దిగులు పుట్టడం ఖాయం. ఈ సమస్యల నుండి తప్పించుకోవాలంటే చలిగాలులు తీవ్రం కాకముందే సరైన సంరక్షణ చర్యలు చేపట్టక తప్పదు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
చలికాలంలో డ్రయర్లను వాడొద్దు. మెత్తని తువాలుతో తుడుచుకుని, గాలికి ఆరనివ్వడం మంచిది. తీవ్రంగా చలువ చేసే హెర్బల్ నూనెలు వేసవికి పనికొస్తాయి తప్ప చలికాలానికి అనువుగా ఉండవు. కాబట్టి తలకు నూనెలు పట్టించేవారు చలికాలంలో ఎక్కువ సేపు నూనెను అలాగే ఉంచుకోరాదు.