ఒక్కోసారి ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలా ఫ్రిజ్ నుండి దుర్వాసన వచ్చినపుడు ఎండబెట్టిన కమలా తొక్కుల పొడిని రెండు చెంచాలు తీసుకుని అందులో కాస్త ఉప్పును కలిపి ఓ పాత్రలో కలుపుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేయండ ఫ్రిజ్‌లో నుండి వచ్చే దుర్వాసనను, తేమనూ పీల్చుకుంటంది ఈ కమలా పొడి. కమలా పొడి లేకపోతే తాజా కమలాపండును ఉంచితే కూడా మంచిది.
నిమ్మజాతి ఫలాల్లో లెమొనేన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది దోమల్ని, ఈగల్ని దూరం చేస్తే శక్తిని కలిగిఉంటుంది. ముఖ్యంగా ఈ రసాయన పదార్థం కమలా ఫలంలో 90 శాతం మేరకు ఉంటుంది. అందువల్ల దోమలూ, ఈగల బెడద ఉన్నచోట ఈ కమలా తొక్కలను ఉంచుకుంటే మంచిది.
ఇకపోతే ఒక సీసాలో రెండు కమలాపండ్ల తొక్కులని వేసి అవి మునిగేంతవరకూ వెనిగర్ వేయాలి. ఆ సీసాను వారం పదిరోజులు అలానే వదిలేయాలి. తరువాత ఆ తొక్కులని తొలగించి మిగిలిన వెనిగర్‌ని స్ప్రే సీసాలో తీసుకుంటే చెక్క ఫర్నిచర్, ఫ్రిజ్, ఓవెన్, స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులు తుడవడానికి చాలా ఉపయోగపడుతుంది.