పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ... మీకోసం నలిగిపోతూ వున్నా. దశాబ్ద కాలంగా 2014 నుంచి 2024 వరకూ రాజకీయాలను వదలకుండా వున్నానంటే ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నాకు ఇష్టం. ఈ రాష్ట్రం పచ్చగా కళకళలాడుతుండాలి. రెండు చోట్ల ఓడిపోయి వున్నానంటే తెలుగు నేలపై నాకు పిచ్చి. మన ఉభయ గోదావరి జిల్లాలు రాష్ట్రానికి అన్నపూర్ణ వంటివి. అలాంటి జిల్లాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు ఉసూరుమనకూడదనే కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసాను.