ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26 : ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు...

ఠాగూర్

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (13:36 IST)
2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను విత్తమంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపవెట్టారు. రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభలో వెల్లడించారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో వ్యవసాయం, విద్య, సంక్షేమం రంగాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వార్షిక బడ్జెట్‌లోని హైలెట్స్‌ను పరిశీలిస్తే, 
 
దీపం పథకం రూ.2,601 కోట్లు
తల్లికి వందనం రూ.9,407 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
జల్ జీవన్ మిషన్‌కు రూ.2,800 కోట్లు
నవోదయ్ 2.0 పథకం కోసం రూ.10 కోట్లు
మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
ఆదరణ పథకానికి రూ.1,000 కోట్లు
ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు