సీఎం జగన్ అసెంబ్లీ స్థానంలోనూ అసమ్మతి : మంత్రి పెద్దిరెడ్డి

మంగళవారం, 13 డిశెంబరు 2022 (08:10 IST)
వైకాపా సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంతో పాటు అన్ని స్థానాల్లో అసమ్మతి ఉందన్నారు. వాటన్నింటిని పక్కనబెట్టి ప్రతి నాయుకుడిని కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అనంతపురం జిల్లా రజాక్ ఫంక్షన్ హాలులో సోమవారం రాప్తాడు నియోజకవర్గం వైకాపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, పత్రికలను అడ్డుపెట్టుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తూ, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 
 
ఎవరైనా ఈ స్థానంలోకి వచ్చి పోరాటం చేస్తామంటే పక్కన కూర్చొని మద్దతు ఇస్తామని రాప్తాపు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాపుసీటు ఇతరులకు ఇస్తారన్న ప్రచార నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు