విజయ్ దేవరకొండ ప్రస్తుతం శ్రీలంక షూట్ లో వున్నారు. కింగ్ డమ్ సినిమా కోసం ఆయన అక్కడ పాల్గొన్నాడు. అక్కడ నుంచి హైదరాబాద్ తిరిగి రానున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ వేడుకకు ట్రెండీ లుక్ లో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. వాట్ ఇండియా థింక్స్ టుడే శుక్రవారం న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది. టీవీ 9 ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ హాజరై అందరినీ సర్ ప్రైజ్ చేశారు.