ఏపీని రెండులక్షల అప్పులకు తీసుకువెళ్ళింది చంద్రబాబు కాదా..? అని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 40వేల కోట్ల బకాయిలను చంద్రబాబు పెట్టి వెళ్లారు. చంద్రబాబు ఏపీని నంబర్ వన్ ప్లేస్‌లో ఉంచామని పచ్చి అబద్దం చెబుతున్నారు. చదువులో (లిటరసీలో)36 స్థానంలో ఉంటే మొదటిస్థానం అని ఎలా చెబుతారు.? అని ఆయన ప్రశ్నించారు.
మాకు ఆ బంగారు గుడ్లు అవసరం లేదు అని ఆయన స్పష్టం చేసారు. యూనిట్‌కు 2.50 వచ్చే దాన్ని 4.50 పైసలు ఎందుకు విద్యుత్ కొన్నారు. ఆ అక్రమ పిపిఏలపైనే రివ్వ్యూ చేస్తున్నాం.. తప్పేంటి? అని ప్రశ్నించారు. నా నియోజకవర్గంలో ఇసుకనే ఉండదు.. నేనెలా అమ్ముకుంటున్నా? మా దగ్గర ఒక్క నడికూడా లేదు. కనీసం వాస్తవాలు కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా? అని అడిగారు.