వెలగపూడి ఘటనకు చంద్రబాబుకి సంబంధమున్నట్లు ఒక్కఆధారమైన చూపగలరా?: వర్ల రామయ్య

మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:23 IST)
సాక్షిపత్రిక అవినీతి సామ్రాజ్యంనుంచి పుట్టిందని,  ఆ పత్రిక పుట్టుకే  అవినీతిమయమని, అందుకే దానిని వార్తాపత్రికగా తాముచూడలేదని, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి అది కేవలం కరపత్రికని, జగన్ కు రక్షణకవచంగా మాత్రమే అదిపనిచేస్తోందని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 
అమరావతిలోని వెలగపూడిలో మాల, మాదిగవర్గాలమధ్య జరిగిన ఘర్షణలో ఒకమహిళ చనిపోతే,  ఇరువర్గాలవారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగిందన్నారు.

ఎంపీ నందిగం సురేశ్ ప్రమేయయంతోనే మహిళహత్యచేయబడిందని ఒకవర్గం వారు అంటే, హోంమంత్రిసుచరిత భర్త దయాసాగర్, నెల్లూరు జిల్లాలో ఎస్ ఐగా పనిచేస్తున్న, వెలగపూడి గ్రామానికి చెందిన తురకా వెంకటరమణ ప్రమేయంతోనే తమపై దాడులు జరిగాయని మరో వర్గం ఆరోపించడం జరిగిందని రామయ్య తెలిపారు.

ఇవన్నీ సాక్షి  కరపత్రిక యాజమాన్యానికి కనిపించలేదని, దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర అని, వెలగపూడిలో ఘర్షణకు పన్నాగమని, దళితుల ఐక్యతనుచూసి ఓర్వలేకనే చంద్రబాబు ఆయావర్గాల్లో చిచ్చుపెట్టా డంటూ అబద్ధాలు, అసత్యాలు వండివార్చారన్నారు.

వెలగపూడి లో రెండువర్గాల మధ్య జరిగినదాడిలో చంద్రబాబునాయుడికి , టీడీపీ వారికిఏమైనా సంబంధంఉందేమో చెత్తరాతలు రాసే చెత్త పత్రిక, ఆపత్రిక యాజమాన్యం సమాధానం చెప్పాలని వర్ల డిమాం డ్ చేశారు.  టీడీపీ,  చంద్రబాబునాయుడు ప్రమేయం ఉందని ఒక్క ఆధారమైనా సాక్షి పత్రికవారు చూపించగలరా అని టీడీపీనేత నిల దీశారు.

హోంమంత్రి భర్త దయాసాగర్, నెల్లూరులో ఎస్ ఐగా పనిచే స్తున్న తురకా వెంకటరమణ వెలగపూడిలో జరిగిన పెళ్లికి హాజరయ్యాకే, అక్కడ గొడవప్రారంభమైందన్నారు. దయాసాగర్ సదరు పెళ్లిలో ఒకహామీఇచ్చారని, ఆ తరువాతే మాలవర్గం రెచ్చిపోయిందన్నారు. తనవెనుక దయాసాగర్ ఉన్నాడంటూ, సదరుఎస్సై బూతులు తిట్టాడని, ఆనాడు అక్కడేం జరిగిందో వాస్తవాలు తెలుసుకోకుండా పనికిమాలిన చెత్తపేపర్లో చెత్తరాతలు రాశారన్నారు.

ముఖ్యమంత్రికి నిజంగా నైతికవిలువలు ఉంటే, వెలగపూడిలో ఏం జరిగిందో పూర్తి వివరాలుతెలుసుకొని, హోంమంత్రిభర్తపై, ఎస్ఐ వెంకటరమణఫైకేసులు నమోదు చేయాల న్నారు. మాదిగవర్గానికి చెందిన సురేష్ పై కేసుపెట్టిన పోలీసులు, అదేవర్గంవారు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ఎందుకు నమోదు చేయలేదో సమాధానంచెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు.

వైసీపీలో మాదిగలకు న్యాయం జరగదా అని ప్రశ్నించిన రామయ్య, వెలగపూడిలో జరిగినవాటితో తమకుసంబంధం లేదని, ఆగ్రామం లోని మాదిగబిడ్డలు తనకుఫోన్ చేసి చెప్పబట్టే, తాను నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని వర్ల స్పష్టంచేశారు. జరిగిన ఘటన ను లోతుగా పరిశీలించాకే తాను మీడియా ముందుకు వచ్చానని, ఎస్ స్థాయిలోఉన్నవ్యక్తి, గ్రామంలోనివారిని అకారణంగా, బూతులు తిట్టడమేంటన్నారు? 

వెలగపూడి ఘటనలో గాయపడిన మాదిగవర్గానికి చెందినవారు ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎందుకు కేసునమోదు చేయలేదో చెప్పాలన్నారు. అసలు ఆ గ్రామంలో గొడవ ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రికి తెలుసా అన్నరామయ్య, ఆధిపత్యపోరుతోనే అక్కడ వివాదం ప్రారంభమైందన్నారు. 

ఎంపీ గొప్పా..లేక ఎమ్మెల్యే గొప్పా అంటూ మొదలైన వివాదంలో హోంమంత్రి భర్త దయాసాగర్, నెల్లూరులో పనిచేసే ఎస్ ఐ జోక్యంతోనే అక్కడిప్రజలు రెండువర్గాలుగా విడిపో యి దాడులకు పాల్పడ్డారని రామయ్య పేర్కొన్నారు.  ఆ విధంగా జరిగిన గొడవను టీడీపీకి అంటగట్టాలనిచూడటం, దళితులమధ్య టీడీపీ కుట్రపెట్టాలని చూసిందని తప్పుడురాతలు రాశారన్నారు.

అదే అమరావతిలో దళితులకు బేడీలువేసి, జైలుకు పంపినప్పుడు, ముఖ్యమంత్రి, సాక్షిపత్రికఏమయ్యాయో చెప్పా లన్నారు.  ఆనాడు హోంమంత్రి సుచరిత అక్కడకు వెళ్లి, జైలుపాలైన వారి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేద న్నారు. మాదిగలకు  అన్యాయం జరిగినప్పుడు హోంమంత్రి ఎక్కడి కి వెళ్లారన్నారు.

దళితడాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిని చేసినప్పు డు, ముఖ్యమంత్రి సొంతనియోజకవర్గంలో దళితయువతిపై అత్యాచారం చేసి, దారుణంగాఆమెని హతమార్చినప్పుడు, హోంమంత్రి ఎందుకు బయటకు రాలేదని రామయ్య నిలదీశారు.  మాదిగలకు అన్యాయం చేయడంకోసం ఒకవర్గాన్ని భుజాన మోయడం ఏమిటని మాత్రమే తానుప్రశ్నిస్తున్నానన్నారు. 

దయాసాగర్, ఎస్ వెంకటరమణ ఒకవర్గానికి కొమ్ముకాస్తే, సురేశ్ అనేవ్యక్తి మరోవర్గంపక్కన నిలిచాడని, ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవి ఏవర్గం వైపు ఉన్నారో విచారించాలని మాత్రమే తాను కోరుతున్నానని రామయ్య స్పష్టంచేశారు. 

జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యతప్రభుత్వంపై లేదా అన్నారు. జరుగుతున్నవాటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి వదిలేస్తే, అవి ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయన్నా రు. తనప్రభుత్వంలో మాదిగలకు స్థానం లేదని ముఖ్యమంత్రి చెప్ప దలుచుకున్నారా అని రామయ్య ప్రశ్నించారు.

చనిపోయిన మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి, దెబ్బలు తిని  ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మాదిగవర్గం వారి వద్దకు ఎందుకు వెళ్లలేదని రామయ్య నిలదీశారు. వైసీపీనేతలు ఎవరైనా సరే, చికిత్సపొందుతున్న మాదిగబిడ్డలవద్దకు ఎందుకు వెళ్లలేదన్నారు. 

దయాసాగర్ పై, నెల్లూరులో పనిచేస్తున్న ఎస్ వెంకటరమ ణలపై హత్యాయత్నం కేసులు పెట్టాల్సిందేనని రామయ్య తేల్చి చెప్పారు. మాదిగ సోదరులు ఎవరూ భయపడవద్దని చెప్పిన ఆయన, వారికి ఎలాంటి సాయం అందించడానికైనా తానుసిద్ధమే నని స్పష్టంచేశారు.  జరిగిన దానిపై పూర్తివిచారణజరిపి, రెండు వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు.

ఆయనకు ఏమాత్రం సమయంఉన్నా, తన కరపత్రికలో చెత్తరాతలు రాయడం మానుకోవాలని చెబితే బాగుంటుందన్నారు. ఉయ్యారులో పారిశుధ్యసిబ్బంది బ్యాంకులముందు పడేసినచెత్తకు, సాక్షిలో రాసే రాతలకు పెద్దగా తేడాలేదని రామయ్య ఎద్దేవాచేశారు. సాక్షివారికి చెత్త అంటే అంత ఇష్టమే ఉంటే, అదే సేకరించుకోవాలన్నారు.

చంద్రబాబునాయుడు అధ్యక్షతన త్వరలోనే పార్టీ సమావేశాలు జరగబోతున్నాయని, అప్పటినుంచి ముఖ్యమంత్రికి అసలుఆట ఆరంభమవుతుందని రామయ్య తేల్చిచెప్పారు. వెలగపూడి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాల ని, నెల్లూరునుంచి వచ్చిన వెంకటరమణ ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవాలన్నారు.

వ్యక్తులు, వ్యవస్థలకు అతీతంగా న్యాయం, చట్టం, ధర్మంకోసం తాము, తమపార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు.  హోంమంత్రి భర్త దయాసాగర్, పేరుకే ఇన్ కంటాక్స్ఆఫీసర్ గానీ, ప్రవృత్తి రీత్యా జగన్మోహన్ రెడ్డికి ఆడిటర్ గా కూడా గతంలో పనిచేశాడన్నారు. హోంమంత్రి భర్త అయినంత మాత్రాన మాదిగలపై జులుం చేయడం ఎంతవరకు సమంజసమని వర్ల ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు