టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

సెల్వి

మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (11:13 IST)
టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు స్నాక్స్ అందిస్తామని చెప్పారు. 
 
పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం 6 రకాల స్నాక్స్ అందించనున్నారు. వారంలో రోజుకొక రకం అందించనున్నారు. ఉడికించిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడా, ఆనియన్ శనగలు, బాయిల్డ్ పెసర్లు, పల్లి పట్టి, మిల్లెట్ బిస్కెట్లు అందించాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇందుకోసం ఒక్కో స్టూడెంట్‌కు రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు