'థాంక్యూ సో మచ్ మావయ్య'.. చంద్రబాబు ట్వీట్‌కు ఎన్టీఆర్ స్పందన

గురువారం, 12 జనవరి 2023 (11:31 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటించారు. సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ చిత్రంలోని పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా, నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదారణ పొందింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచ వేదికలపై సత్తా చాటుతోంది. 
 
తెలుగు సినిమా ఖ్యాతిని నలుమూలలా చాటింది. ఈ చిత్రంలోని "నాటునాటు" పాటకు ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వరించింది. ఆ ఘనతను సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో "ఆర్ఆర్ఆర్" చిత్ర బృందంపై ప్రశంస వర్షం కురుస్తుంది.
 
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును "ఆర్ఆర్ఆర్" చిత్రం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబు తన ట్వీట్ పేర్కొన్నారు. ఎంఎం కీరవాణి, రాజమౌళి, చిత్రం యావత్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాను గతంలో చెప్పినట్టుగానే తెలుగు ఇపుడు ఇండియన్ సాఫ్ట్ పవర్‌గా మారిందన్నారు. దీనిపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. "థ్యాంక్యూ సో మచ్ మావయ్య" అంటూ ప్రతిస్పందించారు. 


 

Delighted to learn that @RRRMovie has won the #GoldenGlobes Award for Best Original Song! Congratulations to @mmkeeravaani, @ssrajamouli and the entire team! Absolutely proud! Like I said earlier, Telugu has now become the language of Indian soft power.#NaatuNaatu #RRRMovie pic.twitter.com/ZpIQ7TbI5K

— N Chandrababu Naidu (@ncbn) January 11, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు