హైదరాబాదులో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. అయితే ఆ ప్రేమ జంట వయస్సు వింటే మాత్రం షాక్ అవుతారు. ఆమెకు 55 ఏళ్లు. ఆయనకు 22 ఏళ్లు. విని షాక్ అవుతున్నారు కదూ.. అయితే వివరాల్లోకి వెళదాం.. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన అయేషా బేగం (55) భర్త నాలుగు నెలల క్రితం మరణించాడు. ఈ క్రమంలో ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్న మహ్మద్ ముదస్సిర్ అలియాస్ అర్షద్ (22)తో ఆమెకు స్నేహం ఏర్పడింది.
ఇద్దరూ ప్రేమించుకున్నారు. సహజీవనం కూడా ప్రారంభించారు. అంతేకాదండోయ్ పెళ్లి కూడా చేసుకోవాలనుకునే నిర్ణయానికి వచ్చారు. కానీ ఇది తెలుసుకున్న కుటుంబసభ్యులు వీరి పెళ్ళికి అంగీకరించలేదు సరికదా బెదిరించారు. అయినా వారు బెదరలేదు. బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో అయేషా అర్షద్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో తలపట్టుకున్నారు. మత పెద్దలతో మాట్లాడాక చెప్తామని ఆ జంటకు పోలీసులు నచ్చజెప్పి పంపారు.