పూర్తి సమయం ప్రజా జీవితానికే... సినిమాల్లో చేయడానికి తీరిక లేదు...

మంగళవారం, 20 నవంబరు 2018 (18:34 IST)
''నేను త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదు. ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు. సినిమాలో నటించేందుకు అవసరమైన సమయం లేదు. ప్రజా జీవితానికే పూర్తి సమయం కేటాయించాను. 
 
ప్రజల్లోనే ఉంటూ, జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు. నా ఆలోచనలు అన్నీ ప్రజాక్షేమం కోసమే, నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే అని జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు