తిరుపతి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని నిర్బంధించడం అప్రజాస్వామికం. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని నిర్బంధించడం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనం.
రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. వ్యవస్థలను సర్వ నాశనం చేస్తున్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం దుర్మార్గపు చర్య.
జగన్ రెడ్డి చర్యలు హిట్లర్ పాలనను తలపిస్తున్నాయి. తిరుపతిలో 43వ డివిజన్ టీడీపీ అభ్యర్థి షాపును వైసీపీ నేతలు కూల్చి వేసి కక్షపూరితంగా వ్యవహరించినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతూ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ భయోత్పాదానికి గురిచేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదు.