ఇటీవల ఆయన బంధువుల్లో ఒకరికి ఐఏఎస్ రావడంతో శ్రీనివాస్ మరింత కుంగిపోయారు. ఇదే కారణంతో గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించడంతో బతికి బయటపడ్డారు. ఈసారి ఆయన తీవ్ర విరక్తితో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నిజామాబాద్ నాలుగో ఠాణా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.