రోడ్డు నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్! (Video)

ఠాగూర్

సోమవారం, 23 డిశెంబరు 2024 (14:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఇందుకోసం ఆయన పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, ఆయన సోమవారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో పర్యటించారు. ఇక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. 
 
అలాగే పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గొడవర్రు గ్రామంలో తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న వివిధ రకాలైన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, బీటీ రోడ్డు మూడు లేయర్ల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. అడుగు మేర రోడ్డును తవ్వి తీసిన శాంపిల్స్‌ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత పలు సూచనలు చేశారు. 

 

పల్లె పండుగలో ఇచ్చిన మాట ప్రకారం, కంకిపాడు మండలం గొడవర్రు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, అక్కడ 1:1 అడుగు త్రవ్వి BT రోడ్డు 3 లేయర్ల నాణ్యతను స్వయంగా తనిఖీ చేసిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyanpic.twitter.com/XHJuCIBG3X

— JanaSena Shatagni (@JSPShatagniTeam) December 23, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు