ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రకటించిన ప్యాకేజీలో ప్రత్యేక అన్న పదం తప్ప వేరే ఏమీ లేదని ట్వీట్ చేశారు. ఆంధ్రులను ఆత్మాభిమానం, వెన్నెముక లేనివారిగా భారతీయ జనతాపార్టీ చూస్తోందని అన్నారు.
ముఖ్యంగా.. ‘బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వెనక్కు వెళ్లింది. దశాబ్ధ కాలపు అవమానాల తర్వాత రాజధాని లేకుండానే, భారీ రెవెన్యూ లోటుతో ఆంధ్రులు గెంటివేతకు గురయ్యారు. స్పెషల్ కేటగిరి హోదా.. స్పెషల్ ప్యాకేజీగా మారిందని వ్యాఖ్యానించారు.