మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

ఐవీఆర్

గురువారం, 16 అక్టోబరు 2025 (20:49 IST)
తను ఎలాంటివాడినో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి బాగా తెలుసునని అన్నారు వర్మ. తనను మంత్రి నారాయణ గారు ఏదో అన్నారంటూ కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... నారాయణ గారు అన్న మాటలు ఏమైనా వీడియో రికార్డ్ వుందా, ఎవరో వర్మ గడ్డి పరక అన్నారని గాలి వార్తలను నన్ను అడగవద్దు.
 
వీడియో వుంటే చూపించండి స్పందిస్తాను. కూటమిలో గొడవలు పెట్టేందుకు చూడవద్దు. చంద్రబాబు గారు గత ఎన్నికల్లో పోటీ విషయంలో ఆగమన్నారు ఆగాను. ప్రచారం చేయమన్నారు చేసాను. నా భార్య, కుమారుడు అందరూ ప్రచారం చేసారు. కూటమి బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తాను. కూటమి మరో పదేళ్ల పాటు అధికారంలో వుండేందుకు చేయాల్సినదంతా చేస్తాను. వర్మ అంటే ఏమిటో పిఠాపురం ప్రజలకు తెలుసు అంటూ చెప్పారాయన.

నేను ఎప్పుడూ టీడీపీకి ఫైర్ బ్రాండే: వర్మ

చంద్రబాబు నాయకత్వంలో నాది 23 ఏళ్ల ప్రయాణం

ఎన్నికల్లో చంద్రబాబు ఆగు వర్మ అంటే ఆగిపోయాను

వర్మ ఈ పని చేయ్ అంటే చేశాను

చంద్రబాబు ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో నేను,
నా భార్య, నా కుమారుడు ప్రచారం చేశాం

కూటమి బలోపేతం కోసం నేను ఎప్పుడూ మౌనంగానే… pic.twitter.com/juitmm0zLB

— ChotaNews App (@ChotaNewsApp) October 16, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు