కేబీఆర్ పార్క్ సమీపంలో భూమి పొరల నుంచి పొగలు... (Video)

ఠాగూర్

శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (10:34 IST)
హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. భూమి పొరల నుంచి పొగలు వస్తున్నాయి. భూమి పొరల్లో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ పొగ దృశ్యాలు హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద గురువారం కనిపించాయి. ఈ పొగలను చూసిన జనం ఆశ్చర్యపోయారు. తొలుత తక్కువగా వచ్చిన పొగలు.. ఆ తర్వాత క్రమంగా పెరిగినట్టు సమాచారం. కాగా, ఇటీవల అదే ప్రాంతానికి చెందిన విద్యుత్ శాఖ సిబ్బంది భూగర్భంలో 11 కేవీ కేబుళ్లను వేశారు. ఇవి దగ్ధం కావడం వల్లే దట్టమైన పొగలు వచ్చినట్టుగా భావిస్తున్నారు. అయితే, పొగలు రావడానికి గల కారణాలను మాత్రం విద్యుత్ అధికారులు భావిస్తున్నారు. 



భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు.. ఆశ్చర్యపోయిన ప్రజలు

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద భూమిలో నుంచి ఒక్కసారిగా వచ్చిన పొగలు.. వాటిని చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు.

అండర్ గ్రౌండ్‌లో ఇటీవల 11KV కేబుల్ అమర్చిన విద్యుత్ శాఖ.. దానివల్లే పొగలు వచ్చి ఉండొచ్చన్న ప్రజలు.

పొగలు రావడానికి అసలు… pic.twitter.com/nJHZMHpofV

— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు