విదేశాల్లో విద్యాభ్యాసం.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
బుధవారం, 29 డిశెంబరు 2021 (14:23 IST)
కరోనా కారణంగా ఈ ఏడాది విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. కానీ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి దేశం నుంటి వెళ్లే విద్యార్థుల్లో ఏపీ మాత్రం అగ్రస్థానంలో నిలిచింది.
2016 నుంచి 2021 వరకు ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న వారిలో 15 శాతం మంది ఏపీ విద్యార్థులే కావడం విశేషం.
2019–2020లో కరోనా కారణంగా విదేశాలు రాకపోకలపై నిషేధం విధించాయి. పలు దేశాలు వీసాల మంజూరును నిలిపేయడంతో విద్యార్థుల విదేశీ విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడింది.
కానీ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో ఏటా ఏపీ నుంచే అత్యధిక శాతం మంది ఉంటున్నారు. వీరిలో ఏపీ విద్యార్థులు 12.43 శాతం మంది ఉన్నారు. ఇక 2017లో 4,56,823 మంది వెళ్లగా వారిలో ఏపీ విద్యార్థుల శాతం.. 12.27గా వుంది.