వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని పొంచివుందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, శాసనమండలిలో బొత్స చేసిన వ్యాఖ్యలు చూస్తే జగన్ నుంచే ఆయకు ప్రాణహాని ఉన్నట్టుగా ఉందనిపిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో గూగుల్, టీసీఎస్, మహీంద్ర, లులు, రిలయన్స్ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సీఎం చంద్రబాబు దార్శనికతే కారణం. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది' అని పల్లా వివరించారు.